రెండేళ్లలో 300 ఎకరాలు కబ్జా చేసిన గొప్ప ఎమ్మెల్యే సైదిరెడ్డి: ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
రెండేళ్లలో 300 ఎకరాలు కబ్జా చేసిన గొప్ప ఎమ్మెల్యే సైదిరెడ్డి: ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, మఠంపల్లి: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే గిరిజనులకు అన్ని రంగాల్లో అభివృద్ధి గౌరవం దక్కిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎంపీ ఉత్తమ్ కమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. 2014 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కలిపిస్తాని హామీ ఇచ్చి గద్దెనెక్కాక విస్మరించారని అన్నారు.

భూమిలేని నిరుపేద గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి అవినీతి అక్రమాలకు, భూ మాఫియాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో సుమారు 300 ఎకరాల భూమిని కబ్జా చేసిన మొట్టమొదటి అవినీతి ఎమ్మెల్యే సైదిరెడ్డి అని వ్యాఖ్యానించారు. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నుండి దౌర్జన్యంగా తన అనుచరులతో బెదిరింపులకు గురిచేసి 107 ఎకరాలు, గుర్రంపోడు తండా వద్ద 150 ఎకరాలు, పెడవీడు రెదెన్యూ పరిధిలో 46 ఎకరాల భూములను కొల్లగొట్టిన గొప్ప ఎమ్మెల్యే సైదిరెడ్డి అని ఆరోపించారు. బహుశా సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఇదే మొదటిసారి ఇదే చివరి అని ఎద్దేవా చేశారు.

గ్రామ పంచాయతీల్లోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు అప్పిరెడ్డి, పాలకవీడు ఎంపీపీ భూక్య గోపాల్, మంజు నాయక్, మాలోతు మోతిలాల్, నవీన్ నాయక్, భీముడు నాయక్, రామచంద్రయ్య, రామిశెట్టి అప్పారావు బాబు నాయక్, భాస్కర్ నాయక్, రాములు నాయక్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed