అలా జరిగితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: MP Uttam Kumar Reddy

by GSrikanth |   (  Updated:2023-01-02 03:55:36  IST  )

ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మాజీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

అలా జరిగితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: MP Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మాజీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ చాలా బలంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. 1994లో ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని, 1999 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని అన్నారు. అయినా, తాను కోదాడ, హుజూర్‌నగర్, హైదరాబాద్‌లో అద్దె ఇంట్లోనూ ఉంటున్నానని అన్నారు. తనపై పదవులు, ఆస్తులపై వ్యామోహం లేదని వెల్లడించారు.

.Also Read...

Telangana Congress సీనియర్ నేతల కీలక నిర్ణయం!

Next Story