- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాహుల్ గాంధీ పార్టీ పాలించే తెలంగాణలొనే ఒక పల్లెటూరు లొనే 950 ఓట్లు కాస్త 2500 పెరిగాయని, అందుకే కేంద్రం బీహార్ నుంచి సర్వే మొదలు పెట్టిందని ఎంపీ రఘనంద రావు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారికి మెదక్ నియోజకవర్గంలో ఐలపూర్ గ్రామంలో 700 పైగా దొంగ ఓట్లు ఎట్లా పెరిగాయనే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మొదటి సారి పొరపాటు జరిగిందని 10 జనవరి ,2024 లో స్ధానిక సర్పంచ్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇచ్చిన ఫైనల్ ఓటర్ లిస్టు కంటే నెల ముందు ఇచ్చామని, 19 జనవరి 2024న జిల్లా కలెక్టర్ కు అదే సర్పంచ్ చేత ఫిర్యాదు కూడా ఇప్పించామని తెలిపారు.
28 ఫిబ్రవరి 2024 న ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చాక తహశీల్దార్ కు, అప్పటి సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒక చిన్న పల్లెటూరు లో 950 ఉండాల్సిన ఓట్లు దాదాపుగా 700 ఓట్లు ఎట్లా పెరిగాయని ప్రశ్నించారు. ఐలపూర్ లో ఉన్న ఇండ్ల వివరాలను 1-1 నుంచి 3-8 వరకు ఇండ్లు ఉంటే స్మశానవాటికకు, బోరింగ్ కు, ట్యాంక్ కు కూడా ఇంటి నెంబర్లు ఇచ్చి ఇష్టమున్నట్టు ఓటర్లను కలిపారని మండిపడ్డారు. 950 ఓట్లు ఉండాల్సిన ఐలపూర్ లో ఇప్పుడు చూస్తే ఏకంగా 2500 ఓట్లు కనపడుతున్నాయన్నారు. ప్రస్తుతం మరో నాలుగు పోలింగ్స్టేషన్ల కూడా పెరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్అధినేత రాహుల్‌గాందీ బెంగళూరు లో రెండు దొంగ ఓట్లను చూపి అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడని, వేల ఓట్లు ఇక్కడ పెరిగితే వాటిని తొలగించవద్దా అంటూ నిలదీశారు. దొంగ ఓట్లకు మీ మద్దతు ఉన్నదా, దొంగ ఓట్లు తీసేస్తే మీకు భయం దేనికి అంటూ నిలదీశారు.






