మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరో కీలక బాధ్యత

by Ajay Maddhiboyina |

పార్ల‌మెంట్ క‌మిటీల్లో మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుకు మ‌రో కీల‌క బాధ్య‌త ద‌క్కింది. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్టేష‌న్‌లో ఆయనను సభ్యుడిగా నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరో కీలక బాధ్యత
X

దిశ, వెబ్ డెస్క్: పార్ల‌మెంట్ క‌మిటీల్లో మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుకు మ‌రో కీల‌క బాధ్య‌త ద‌క్కింది. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్టేష‌న్‌లో ఆయనను సభ్యుడిగా నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో చైర్ పర్సన్‌గా బాలశౌరి వల్లభనేని ఉన్నారు. అంతే కాకుండా రఘునందన్ రావుతో పాటూ సభ్యులుగా పి. చిదంబరం, సతీష్ కుమార్ గౌతమ్, మొహమ్మద్ జావిద్, సంబాజీ రావు మానె, మహువా మోయిత్రా, ప్రేమ చంద్రన్, శ్రీరాజీవ్ రాయ్, ఏ. రాజా, అలోక్ కుమార్ సుమన్, వివేక్ థాకూర్, రాజేశ్ వర్మలను సభ్యులుగా నియమించారు. రఘునందన్ రావు ఇప్పటికే పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ మిరియు కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు మరో కీలక బాధ్యత దక్కడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఖుషీ అవుతున్నారు.

Next Story