Raghunandan Rao: పాశమైలారంలో పేలుడు ఘటనపై ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్

by Prasad Jukanti |

పాశమైలారంలో పెలుడు ఘటనపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.

Raghunandan Rao: పాశమైలారంలో పేలుడు ఘటనపై ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamailaram) పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రలో సంభవించిన రియాక్టర్ పేలుడు ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని ప్రభుత్వం తనిఖీలు పెంచకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఓ చానల్ తో మాట్లాడిన ఆయన.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలను నియామకాలను చేపట్టి వారి చేత పరిశ్రమల్లో సేప్టీ తనిఖీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలలో కార్మికులకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పటాన్ చెరు, పాశమైలారంలోని పరిశ్రమల వల్ల చిన్నారులు, గర్భిణిలు, ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని జనావాసాలకు దూరంగా తరలించాలని ఈ తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కెమికల్ జోన్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను చాలా సార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు.

Next Story