- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఎంపీ రఘునందన్ రావు భేటీ
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలుపోందిన రఘునందన్ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలుపోందిన రఘునందన్ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండో దఫా మెట్రో లైన్ విస్తరణలో భాగంగా పటాన్ చెరు వరకు పొడిగించాలని ఎంపీ హోదాలో వినతి పత్రం అందజేశారు. ఎంపీ వినతిపై సానుకూలంగా స్పందించిన మెట్రో ఎండీ 30 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేసి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ బేటి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా నా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి దశలోనే పటాన్ చెరు వరకు మెట్రో తీసుకొస్తానని, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో తీసుకొస్తానని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
Next Story






