- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరంపై CBI విచారణకు సిద్ధం.. MP రఘనందన్‌రావు ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన వరకు సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రికి లేఖ రాయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన వరకు సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రికి లేఖ రాయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ అది కూళేశ్వరం అని మాట్లాడి కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తామని తనతో పాటు రాహుల్ గాంధీ చేత చెప్పించి రెండున్నర సంవత్సరాలుగా కాలయాపన చేయడం రెండు పార్టీల ఒప్పందం స్పష్టంగా కనపడుతోందని ఆరోపణ చేశారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్, బీఆర్ఎస్దొంగ డ్రామాలు వేసి బాహుబలి లాగా డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపించారు.
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కంపెనీకి రేవంత్ రెడ్డి మానస పుత్రిక అయిన మూసీ ప్రాజెక్టు కాంట్రాక్టు కూడా ఇస్తున్నారని, అందుకోసమే ఆ కంపెనీకి కాంట్రాక్టు లభించడం కోసమే నిబంధనలు కూడా మార్చినట్టు ఉందన్నారు. త్వరలోనే అదే కంపెనీకి మూసీ ప్రాజెక్టులో మొదటి దశ కింద రూ.9500 కోట్ల టెండర్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుందన్నారు. కేసీఆర్ కూతురు కవిత మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారు లక్షల కోట్ల అవినీతి చేశారని చెప్తున్నా కూడా అప్రూవర్‌గా ఎందుకు మార్చడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మావోయస్టు పార్టీ లాగే.. బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.






