BC Reservations: ఈ నెల 14న తెలంగాణ బంద్.. ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపు

by Ramesh Naini |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

BC Reservations: ఈ నెల 14న తెలంగాణ బంద్.. ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Local body elections) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations)పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇందుకు నిరసనగా బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఈ నెల 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం కృష్ణయ్య (R. Krishnaiah) మీడియాతో మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనలు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 14న తెలంగాణ బంద్ (Telangana bandh) నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందరూ కలసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరినట్లు చెప్పారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

Next Story