- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త బిల్లుతో ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం
శాంతి బిల్లు, ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్లు సహా మరికొన్ని కీలకమైన బిల్లులను పార్లమెంట్లో..

- రాష్ట్రాలపై ఆర్థిక భారం
- ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొత్త బిల్లును ప్రవేశపెట్టి మహాత్మా గాంధీ పేరును ఆ పథకానికి తొలగించారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. అలాగే పని దినాలపై స్పష్టత లేకుండా చేశారని... బడ్జెట్ కేటాయింపు కూడా గందరగోళంగా ఉందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించేవని... కానీ ఈ కొత్త బిల్లు ప్రకారం.. కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించిందన్నారు. దీనివల్ల ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోయారు. అలాగే రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని.. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు.
శాంతి బిల్లు, ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్లు సహా మరికొన్ని కీలకమైన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారని... ఈ బిల్లులు ప్రజాభిప్రాయానికి ప్రజాభిషానికి వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు. కొత్త బిల్లుతో ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ విమర్శించారు. ఇటీవల తిరుమల కొండపై ఉన్న హథీరాం మఠానికి సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేస్తున్నారని.... కూల్చవద్దని తాము ఏపీ సీఎం చంద్రబాబును కోరామన్నారు. కలిసి ఫిర్యాదు చేయాలని ప్రయత్నించామని... కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో.. వారి కార్యాలయంలో ఫిర్యాదు కాపీని అందజేశామన్నారు. ఆ తర్వాత మళ్లీ కూల్చే ప్రక్రియను ప్రారంభించారని విమర్శించారు. మఠాన్ని కూలగొట్టకుండా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో బంజారా జాతికి చెందిన వ్యక్తిని బోర్డు మెంబర్‌గా నియమించారని.. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. ఏపీకి చెందిన బంజారా జాతి వ్యక్తికి టిటిడి బోర్డులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.






