లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన కొండా మురళి.. MP మల్లు రవి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కాంగ్రెస్(Telangana Congress) క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) చిట్‌చాట్ చేశారు.

లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన కొండా మురళి.. MP మల్లు రవి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కాంగ్రెస్(Telangana Congress) క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసిఫాబాద్, వరంగల్, గజ్వేల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌(Meenakshi Natarajan)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత కొండా మురళి(Konda Murali) వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొండా మురళి శనివారం గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్‌కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఆ తర్వాత మీడియాతో మల్లు రవి చిట్ చాట్ నిర్వహించారు.

Next Story