జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెబల్స్‌‌గా బరిలో దిగితే సస్పెండ్ చేస్తాం..ఎంపీ మల్లు రవి వార్నింగ్

by Ajay Maddhiboyina |

నేడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. స‌మావేశం అనంత‌రం ఎంపీ మ‌ల్లు ర‌వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించామని చెప్పారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెబల్స్‌‌గా బరిలో దిగితే సస్పెండ్ చేస్తాం..ఎంపీ మల్లు రవి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. స‌మావేశం అనంత‌రం ఎంపీ మ‌ల్లు ర‌వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించామని చెప్పారు. నిరంజన్ రెడ్డికి సంబంధించిన కేసుపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందితో మాట్లాడి వైస్ ప్రెసిడెంట్ ప్రకటన చేస్తారని అన్నారు. కరీంనగర్ నుండి నుండి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయని వారికి షోకాజ్ నోటీసులు పంపించి వాళ్లను పిలిపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అంతేకాకుండా త్వరలో రాబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణను అందరూ దృష్టిలో పెట్టుకోవాల‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ గుర్తుపై ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్నారు. అయిన‌ప్పకీ ఎవ‌రైనా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా బ‌రిలోకి దిగితే సస్పెండ్ చేయబడతారని హెచ్చరించారు. తరవాత సమావేశంలో పూర్తి వివరాలను తెలియజేస్తామని వ్యాఖ్యానించారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల కాంగ్రెస్ వ‌ర్గాలుగా విడిపోవ‌డం వ‌ల్ల న‌ష్టం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఒకే పార్టీలో రెబ‌ల్స్ బ‌రిలో దిగ‌డం వ‌ల్ల ఫ‌లితాలు దారుమారై మూడో వ్య‌క్తి విజ‌యం సాధించారు.

Next Story