- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం చెబుతున్నాడు: ఎంపీ లక్ష్మణ్ ఫైర్
కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం స్పష్టంగా చెబుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వాళ్ల నాయకత్వం మెప్పుకోసం ఒక ఎజెండాగా తీసుకుని రేవంత్ రెడ్డి పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సీఎం స్పష్టంగా చెబుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వాళ్ల నాయకత్వం మెప్పుకోసం ఒక ఎజెండాగా తీసుకుని రేవంత్ రెడ్డి పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వారి మంత్రి వర్గ సభ్యులు కూడా అదే రీతిలో ప్రవర్తిస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం సైతం హిందువులను కించపరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం సోమనాథ్ ఆలయ సమగ్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ముస్లిం వ్యతిరేఖ పార్టీలకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీజేపీ వల్ల ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఏపీలో చంద్రబాబుతో పొత్తు ద్వారా బీజేపీ అడుగుపెట్టిందని వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు.






