MP Laxman: రేవంత్ నీ కల్లబొల్లి మాటలు ఇక ఆపెయ్.. ఎంపీ లక్ష్మణ్ ఫైర్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అభివృద్ధిని బీజేపీ (BJP) అడ్డుకుంటోందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెబుతోన్న కల్లబొల్లి మాటలను ఇకనైనా ఆపాలని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Rajya Sabha MP Laxman) ఫైర్ అయ్యారు.

MP Laxman: రేవంత్ నీ కల్లబొల్లి మాటలు ఇక ఆపెయ్.. ఎంపీ లక్ష్మణ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అభివృద్ధిని బీజేపీ (BJP) అడ్డుకుంటోందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెబుతోన్న కల్లబొల్లి మాటలను ఇకనైనా ఆపాలని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Rajya Sabha MP Laxman) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌ (Bandi Sanjay)లపై రేవంత్ ఎదురుదాడికి దిగడం ఏంటని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు (Six Guarantees) అంటూ జనాన్ని నట్టేట ముంచారని, ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. 420 హామీలపై ప్రశ్నిస్తే.. సమాధానాలను చెప్పలేక తిరిగి బీజేపీ (BJP)పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా రిజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ (Regional Ring Road Project) డీపీఆర్ (DPR) లోపభూయిష్టంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను స్థరాస్తి వ్యాపారం కోసం చేస్తున్నారా అని మండిపడ్డారు.

ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి భూ సేకరణ చేయలేదని అన్నారు. ఆర్ఆర్ఆర్‌తో భువనగిరి (Bhongir)తో పాటు చౌటుప్పల్ (Choutuppal) ప్రాంతాలు అస్థిత్వాన్ని కోల్పోతాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని పెద్ద ఎత్తున ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఏడాది కాంగ్రెస్ (Congress) పాలనలో తెలంగాణ (Telangana) ప్రజలకు ఒరిగిందేమి లేదని కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉపాధ్యాయులు (Teachers), గ్రాడ్యుయేట్లు (Graduates) తిరబడ్డారని, మల్క కొమురయ్య (Malka Komuraiah) గెలుపు బీజేపీని మరింతగా బలపరుస్తోందని అన్నారు. ఉత్తర తెలంగాణ (North Telangana) బీజేపీ (BJP)కి కంచుకోటగా మారిందని ఎంపీ లక్ష్మణ్ అభివర్ణించారు.

Next Story