MP Laxman: ప్రధానిని విమర్శిస్తే పేరొస్తుందా.. రేవంత్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్

by Shiva |
MP Laxman: ప్రధానిని విమర్శిస్తే పేరొస్తుందా.. రేవంత్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రధానిని విమర్శిస్తే తనకు పేరుస్తుందని అనుకోవడం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూర్ఖత్వమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ (CM Revanth) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజలందరి మనిషి అని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కూడా గతంలో ఇలానే నరేంద్ర మోడీపై ఇష్టానుసారంగా మాట్లాడారని అనంతరం ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పరిపూర్ణంగా చేయలేదని.. అంతా గందరగోళంగా ఉందని అన్నారు. ముస్లింలను బీసీ (BC)ల్లో చేర్చి కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మత ప్రాతపదికన రిజర్వేషన్లను తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అభ్యర్థులు గెలవడం పక్కా అని అన్నారు. రేవంత్ భాష చూసి జనం చీదరించుకుంటున్నారని.. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి రూ.వేల కోట్లు నిధులు ఇస్తున్నా.. కేంద్రం ఏమి ఇవ్వట్లేదంటూ కాంగ్రెస్ విష ప్రచారం చేయడం సరికాదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Advertisement
Next Story