- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Laxman: రాజ్యాంగ స్ఫూర్తిని మరిచావా కేటీఆర్.. ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలో తాము పోటీకి దూరం అంటూ ఇప్పటికే అధికార పార్టీ ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలో తాము పోటీకి దూరం అంటూ ఇప్పటికే అధికార పార్టీ ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తాము కూడా పోటీ చేయట్లేదని శనివారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో గ్రేటర్ హైదరాబాద్ నేతలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అదేవిధంగా ఎవరైనా పార్టీ గీత దాటితే వారిపై వేటు తప్పదని సొంత పార్టీ నేతలను హెచ్చరించారు. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంఐఎంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లాలూచీ పడ్డాయని కామెంట్ చేశారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించాలని కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. కానీ, తెలంగాణ (Telangana)లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో రాష్ట్రంలో తాము స్వతంత్రంగానే అధికారంలోకి రావడం పక్కా అంటూ జోస్యం చెప్పారు. తమ ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పన్నాగాలు పని చేయబోవని అన్నారు. ఓటింగ్ దూరంగా ఉండాలంటూ సొంత పార్టీ నాయకులకు హితబోధ చేస్తున్నారని.. ఓటు ఆయుధమనే రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారా.. కేటీఆర్ అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.






