ఈ సారి కారు షెడ్డుకు వెళ్లడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్

by Satheesh |

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. ఇవాళ సోమాజీగూడలోని బీజేపీ మీడియా

ఈ సారి కారు షెడ్డుకు వెళ్లడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. ఇవాళ సోమాజీగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో మాట్లాడారు. మోడీ మూడు రోజుల పర్యటనతో తెలంగాణ క్యాడర్‌లో జోష్ నింపిందని అన్నారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఆచరణకు అమలయ్యే హామీలను మాత్రమే బీజేపీ ఇచ్చిందని స్పష్టం చేశారు. తెచ్చుకున్న తెలంగాణ అధోగతి పాలు కావొద్దని, లక్షల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే ప్రకటనలు ఆపివేయడం హర్షించదగినదని తెలిపారు. కారు షెడ్డుకు వెళ్లడం ఖాయమని, చెయ్యికి మొండి చెయ్యి గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు రాలేదన్నారు. ఆంధ్ర, రాయలసీమలో వచ్చే మెజార్టీ సీట్లతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వివరించారు. ముస్లిం పార్క్ ఏర్పాటు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి హామీలు ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పార్టీల గుర్తింపుని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Next Story