సీఎం రేవంత్ సిగరెట్, బీర్ తాగరు.. ఆయన ఒక ఐకాన్: కొండా విశ్వేశ్వరరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-26 13:35:59  IST  )

సీఎం రేవంత్ సిగరెట్, బీర్ తాగరని, ఆయన ఒక ఐకాన్ అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు...

సీఎం రేవంత్ సిగరెట్, బీర్ తాగరు.. ఆయన ఒక ఐకాన్: కొండా విశ్వేశ్వరరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) సిగరెట్, బీర్ తాగరని, ఆయన ఒక ఐకాన్ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(Chevella Mp Konda Visveswara Reddy Reddy) అన్నారు. యాంటీ నార్కోటిక్ డే(Anti-Narcotics Day) సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదిక(Hyderabad Art Gallery)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్నేహితులకు డ్రగ్స్ అలవాటు ఉంటే అలా చేయొద్దని చెప్పాలని తెలిపారు. అవగాహన లేకుండా డ్రగ్స్‌ తీసుకుంటారనడం కరెక్ట్ కాదన్నారు. ఇవాళ, రేపు పిల్లలు డ్రగ్స్‌కు అడిక్ట్ అవుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకూ సిగరెట్, బీర్, విస్కీ తాగలేదని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఫుట్‌బాల్, సాకర్ ఆడతారని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణతోనే దేశం ముందుకు నడుస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Next Story