- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారు.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
చేవెళ్లలో బస్సు ప్రమాదానికి గురైనా రోడ్డుతో తమిళనాడుకు లింక్ ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ -బిజాపూర్ జాతీయ రహదారి 163 పై (Hyderabad-Bijapur National Highway 163) మీర్జాగూడ వద్ద ఇవాళ తెల్లవారు జామున జరిగిన కంకర టిప్పర్- ఆర్టీసీ బస్సు ప్రమాదం (Chevella bus accident) ఎన్నో కుటుంబాలని ఛిద్రం చేసింది. బాధితుల ఆర్తనాదాలు అందరిని కలిచివేస్తున్నాయి. 21 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రమాదానికి రోడ్డుపై ఏర్పడిన గుంత కారణం అని స్థానికులు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఘనటపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రోడ్డు నిజాం కాలంలో రిచ్ లైన్ అని నాడు టాంగాలు, పాత కార్లు ప్రయాణించేందుకు నిర్మించిన రోడ్డు మార్గం అన్నారు. ఇది పూర్తిగా వంకర్లు తిరిగి ఉంటుందని చెప్పారు. ఇంత కాలం ఈ మార్గాన్నే విస్తరిస్తూ వస్తున్నారని, వికారాబాద్ ప్రజలు హైదరాబాద్‍కు వెళ్లేందుకు ఇదొక్కటే హైవే మార్గం అని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఈ హైవేను విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలతో 2017లో ఈ మార్గంతో పాటు తెలంగాణలో మరో 10 హైవేలను నితిన్ గడ్కరీ మంజూరు చేశారని చెప్పారు.
పూర్తి నిర్లక్ష్యం బీఆర్ఎస్ దే:
ఆ తర్వాత కేంద్రం నిధులు మంజూరు చేసినా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ (land acquisition) విషయంలో చాలా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కరీంనగర్, నల్గొంలోని హైవేల కోసం భూసేకరణ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మాత్రం భూసేకరణను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హాయాం చివర్లో భూసేకరణ చేపట్టినా తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం వంకరటింకర మార్గంలోనే భూసేకరణ మొదలు పెట్టిందన్నారు. వంకర టింకర మార్గంలోనే విస్తరణ చేస్తే వందలాది ఏండ్ల మర్రిచెట్లు పోతున్నాయని తమిళనాడుకు చెందిన పర్యావరణ ప్రేమికులు కోర్టులో కేసులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకెక్కిన వారెవరు స్థానికులు కాదన్నారు. వీరికి మర్రిచెట్ల మీద ఫికర్ ఉంది కానీ ప్రజల ప్రాణాలమీద లేదని విమర్శించారు. మర్రి చెట్లను ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని ఎంతో సముదాయించినా వినలేదని చివరకు ఇటీవల కేసు విత్ డ్రా చేసుకోవడం పనులు మొదలయ్యాయన్నారు. భూసేకరణ విషయంలో పూర్తి నిర్లక్ష్యం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. బీఆర్ఎస్‍కు రంగారెడ్డి జిల్లా అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే కనిపిస్తుంది తప్ప ఈ జిల్లా ప్రజలు కనిపించరని విమర్శించారు.






