బిగ్ బ్రేకింగ్: చంపేస్తామంటూ MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బెదిరింపులు

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: చంపేస్తామంటూ MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను హత్య చేస్తామంటూ కొందరు వీడియోలు పోస్ట్ చేశారని వెంకట్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఇటీవల ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకును తన అనుచరులు చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. చెరుకు సుధాకర్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని .. ఇకపై తన అనుచరులు ఉరుకోరని చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌కు స్వయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నేరుగా వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తెలంగాణ ఉద్యమకారులు భగ్గుమన్నారు. తమను హత్య చేస్తామని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుహాస్ పోలీసులతో పాటు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాడు.



Next Story

Most Viewed