బహిరంగ సభలో రేవంత్ రెడ్డికి MP కోమటిరెడ్డి సవాల్

by Disha Web Desk 2 |
బహిరంగ సభలో రేవంత్ రెడ్డికి MP కోమటిరెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేరుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖిందర్ సుక్కు, మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, బోసురాజు, చిన్నారెడ్డి, నాగం, సంపత్ సహా కీలక నేతలంతా పాల్గొన్నారు.

అయితే.. ఈ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తాము గెలిపిస్తామని.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరదాగా సవాల్ విసిరారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కోమటిరెడ్డి సవాల్‌కు స్పందించారు. 12 కాదని, 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలను కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో వేదికమీద ఉన్న నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహాలో పోటీ పడి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed