మహిళా చైతన్యానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ: రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్

by Ajay Maddhiboyina |

వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, ఆ దారుణ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్​పేర్కొన్నారు. శుక్రవారం తమ పార్టీ రాష్ట్రంలో కార్యాలయంలో ఆమె జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.

మహిళా చైతన్యానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ: రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, ఆ దారుణ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్​ పేర్కొన్నారు. శుక్రవారం తమ పార్టీ రాష్ట్రంలో కార్యాలయంలో ఆమె జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విసునూరు రామచంద్ర రెడ్డి వంటి భూస్వాముల బలవంతపు పన్నుల వసూలు వంటి చర్యలను తీవ్రంగా ఎదుర్కొని, చాకలి ఐలమ్మ పోరాటం అమూల్యమైన విజయం సాధించారని పేర్కొన్నారు. ఐలమ్మ గొప్ప పోరాట చరిత్రను గత పాలకులు బాధ్యతలేని విధంగా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలబెట్టకపోవడం అనేది అసూయతో, స్వార్థంతో వ్యవహరించే పాలకుల దుశ్చర్య ఇది. పెత్తందారి పెట్టుబడి దారితనం, బూర్జువా మనస్తత్వంతో ఉన్న ప్రభుత్వాలు తరచుగా ఇలాగే చరిత్రను మరచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా ప్రధాని మోడీ పాలనలో కూడా బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించడం, బీసీల హక్కులను పరిరక్షించడానికి జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వడం వంటి అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ పధకాలతో దేశవ్యాప్తంగా బడుగు వర్గాలకు, బీసీలకు విస్తృతంగా అవకాశాలు దొరికాయని అనేక సందర్భాలు నిరూపించాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి బీసీల పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు.

స్థానిక సంస్థల్లో తాము జీవో తీస్తామంటూ మాటలు మాత్రమే చెలాయించడం తప్ప నిజంగా పారదర్శకంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలనే ఆలోచన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గం, విద్యారంగం, ఉద్యోగాల్లో బీసీలకు ఎక్కడ 42 శాతం హక్కులు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. బీసీలకు ద్రోహం చేసిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో ఇప్పటికే 22 నెలల కాంగ్రెస్ పాలన గడిచిన బీసీలకు న్యాయం చేసేలా, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టబద్ధంగా ముందుకు వెళ్లేలా ఎందుకు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

Next Story