- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాడ్సే చంపేసినట్లే మోడీ సర్కార్ గాంధీ పేరును చంపేసింది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశ చరిత్రలో నేడు చీకటి రోజు అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ చరిత్రలో నేడు చీకటి రోజు అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మహాత్మగాంధీ పేరును పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం చంపేసిందని అన్నారు. 1948లో గాడ్సేను చంపినట్టుగానే మోడీ ప్రభుత్వం గాంధీ పేరును చంపేసిందని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకం ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇది ప్రజలు గమనించాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలుపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ కాదు గాంధీ ముక్త భారత్ చేయాలనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీ లాంటివారి కోసమే పనిచేస్తుందని చెప్పారు. గాంధీ పేరు ఎక్కడ ఉన్నా తుడిచివేస్తూ తన పేరు ఉండేలా మోడీ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది మన దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అని మండిపడ్డారు.






