- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విద్యార్థులారా దయచేసి ఆ సినిమా చూడండి’.. ఇంటర్ ఫలితాల విడుదల వేళ MP ఈటల సందేశం
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు(Inter Results) ఏప్రిల్ 22వ తేదీన విడుదల కానున్నాయి. అదే రోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు(Inter Results) ఏప్రిల్ 22వ తేదీన విడుదల కానున్నాయి. అదే రోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా ప్రకటించారు. కాగా తెలంగాణలో దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. www.tgbie.cgg. gov.in అనే ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.
ఈ క్రమంలోనే ఇంటర్ విద్యార్థులకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇంటర్మీడియట్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోతే విద్యార్థులు మనస్తాపానికి, ఆందోళనకు గురికావద్దు. ఒక్క పరీక్ష ఫలితమే అంతిమం కాదు. ఒక్కసారి ఫలితం అనుకూలంగా రాకపోతే, జీవితమే ముగిసిపోయిందనే భావన ఉండరాదు. జీవితంలో అవకాశాలు ఎన్నో ఉంటాయి.. వస్తాయి. తిరిగి విజయం సాధించవచ్చు. 12th ఫెయిల్ అని OTTలో ఒక సినిమా ఉంది చూడండి. అపజయం కూడా విజయానికి మెట్టు లాంటిదే. ఎక్కుతూ పోవాలితప్ప కుంగి పోవద్దు’ అని సూచనలు చేశారు.
తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలి :
‘మీ ప్రేమ, మద్దతు పిల్లలకు అత్యంత అవసరం. ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు అండగా ఉంటామనే భావన వారికి కలిగించాలి. మాకు మీరు ముఖ్యం.. ఫలితాలు కాదు అనే సందేశం ఇవ్వాలి. మరోసారి ట్రై చేసి పాస్ కావోచ్చు అని ప్రోత్సహించాలి. ఇతరులతో పోల్చడం వల్ల విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని మూలంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు’ అని తల్లిదండ్రులను ఈటల రాజేందర్ హెచ్చరించారు. అంతేకాదు.. ఇంటర్‌లో పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు, ఫెయిలైన విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.






