కేసీఆర్‌ను రక్షించాల్సిన అవసరం నాకేంటి?.. త్వరలో అన్నీ బయటపెడతా.. MP ఈటల సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-08 06:19:59  IST  )

కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎంక్వైరీపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ను రక్షించాల్సిన అవసరం నాకేంటి?.. త్వరలో అన్నీ బయటపెడతా.. MP ఈటల సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎంక్వైరీపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ ఎదుట విచారణ హాజరయ్యాను.. ఆనాటి ఆర్థికశాఖ మంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అందులో తన పాత్రను కమిషన్‌ ఎదుట వివరించాను.. కేసీఆర్‌ను రక్షించాల్సిన అవసరం నాకు లేదు.. కావాలనే కాంగ్రెస్ మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కామెంట్స్ చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కమిషన్ ముందుకు రాజకీయ ప్రకటన చేయడానికి వెళ్లలేదని అన్నారు. మంత్రివర్గ ఉప సంఘం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదని తెలిపారు. కాళేశ్వరంలోని అనేక ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను కేబినెట్‌ సబ్ కమిటీ సూచించింది. త్వరలోనే అన్ని జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలు బయటపెడతా అని కీలక ప్రకటన చేశారు.

కేబినెట్‌లో చర్చించకుండా.. నిర్ణయం తీసుకోకుండా ఏదీ జరుగదు.. అలాంటిది కేబినెట్‌ చర్చించలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఏ నిర్ణయాన్ని కేసీఆర్ సొంతంగా అమలు చేయలేదు. అందరి చేతా కేసీఆర్ సంతకాలు తీసుకున్నారు.. ఈ విషయం అప్పటి మంత్రులు తుమ్మల, జూపల్లి, కడియం శ్రీహరిలకు కూడా తెలుసని అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే.. పీసీ ఘోష్ రిపోర్ట్ బయటపెట్టి చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Next Story