- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌ను కాపాడండి : జలమండలి ఎదుట ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా
హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ SNDP పనులు పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు త్రాగునీరందించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajendar) బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. ఈ

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ SNDP పనులు పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు (Double Bedroom Houses) త్రాగునీరందించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajendar) బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా నగరంలో అనేక చోట్ల డ్రైనేజీ (Hyderabad Drainage Issue) పనులు పూర్తి కాలేదన్నారు. త్రాగునీరు రావట్లేదని మొరపెట్టుకున్నా సమస్యలు పరిష్కరించకపోగా నిధులు లేవని, పైపులు మీరే తెచ్చుకోవాలని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇలాగే మొద్దు నిద్రపోతే సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ ఉద్యమం చేస్తామన్నారు.
SNDP ప్రాజెక్టును సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీ ఉన్నప్పుడు ఉన్న నగరాన్ని బాగు చేయాలని, నగరం మునిగిపోకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఈ విషయంపై ప్రగల్బాలు పలికారన్నారు. ఉన్న పైపులైన్లకే మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రభుత్వం సిబ్బందిని పెంచి వర్షాల సమయంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.






