- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచాలి : ఎంపీ ఈటల డిమాండ్
నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు వేళకు రాకుంటే ప్రయాణికులు ఎలా ఎక్కుతారని.. సకాలంలో వస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

- సమయపాలన లేకుంటే వీటి వల్ల ఏం ఉపయోగం
- జంట నగరాల్లోని రైల్వే సమస్యలు తీర్చండి
- ద.మ.రైల్వే జీఎంతో భేటీ అయిన ఎంపీ ఈటల
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు వేళకు రాకుంటే ప్రయాణికులు ఎలా ఎక్కుతారని.. సకాలంలో వస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్ రైల్ నిలయంలో ద.మ.రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. నగరంలోని రైల్వే సమస్యలపై ఆయన జీఎంతో చర్చించారు. జంటనగరాల్లో రైల్వే సమస్యలు తీర్చి ప్రజారవాణా మరింత మెరుగయ్యేందుకు సహకరించాలని కోరారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు ఉండడం వల్ల ట్రాఫిక్ జాములతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత సంవత్సరంగా చేస్తున్న కృషి వల్ల 12 ఆర్ యూ బీ, ఆర్ఓబీల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర మంత్రిని తీసుకువచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. ఫతే నగర్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. దీనిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని కోరారు. సుచిత్ర, ఆనంద్ బాగ్ లో ఎంఎంటీఎస్ స్టాప్ లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ బొల్లారం స్టేషన్ లో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉప్పల్ లో నిర్మించిన ఆర్వోబీ అక్టోబర్ 15 నుండి అందుబాటులోకి రానుందని రైల్వే అధికారులు ఎంపీకి తెలిపారు. మల్కాజ్గిరి, మేడ్చల్ రైల్వే స్టేషన్లో పునరుద్ధరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని.. పనులు పూర్తిచేసి మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని ఈటల మీడియాకు తెలిపారు. హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు అలసిపోతున్నారని.. రైల్వే పరంగా చేయాల్సిన పనులు చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు వెల్లడించారు.






