- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికల వేళ MP ఈటల కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికల వేళ MP ఈటల కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్, అసెంబ్లీతో పాటు గ్రామ సచివాలయాలు, మండల జిల్లా పరిషత్‌లు సమర్థవంతంగా పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఎంపీ ఈటల రాజేందర్‌అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం నిలపగలిగే శక్తి ప్రజలకే ఉంటుందని, ఈ సంస్కృతిని అంతం చేయాలని కోరారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గ్రామాల్లో ఉండే సమస్యలపై సర్పంచ్‌కి ఉన్న అవగాహన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలకు ఉండదని, అందుకే గ్రామ సచివాలయాలు ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజల సమస్యలు అంత గొప్పగా పరిష్కారం అవుతాయన్నారు.
వాటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. కేంద్రం ఇచ్చే పర్ కాపిటా, ఫైనాన్స్ కమిషన్, ఉపాధిహామీ నిధులతో మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గత సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక పోవడంతో అనేకమంది సర్పంచ్‌లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తియిన బిల్లులు చెల్లించలేని, పనులు చేయలేని మంత్రులు గ్రామాలకువచ్చి సర్పంచ్‌లను గెలిపించాలని ఈ మూడేళ్లు పనులు చేస్తామని చెప్పే మాటలు నమ్మవద్దన్నారు.
గ్రామపంచాయితీలను అత్యంత నిర్వీర్యం బీఆర్ఎస్చేసిందని, బిల్లులు పెండింగ్ పెట్టింది వాళ్లే ఇప్పుడు వచ్చి మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. వారు అక్కడ ఇక్కడ అధికారంలో లేరు వారిది కత్తి కాదు నెత్తి కాదు. వారు గెలిచి చేసేది కూడా ఏమీ లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కేవలం కేంద్రప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. గ్రామాల్లో పెరిగే చెట్లు, పారే మురుగు కాలువలు, వేసే సిమెంట్ రోడ్లు, కడుతున్న గ్రామపంచాయితీ, అంగన్వాడీ భవనాలు, కట్టిన రైతువేదికలు, స్మశానవాటికలు, తడిచెత్త - పొడిచెత్త షెడ్లు, చౌరస్తాలో పెట్టిన హైమాక్స్ లైట్లు అన్నీ కేంద్రప్రభుత్వ నిధులతో పెట్టినవేనని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే ఒరిగేది ఏమీలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఆగం ఆగం అయ్యి హామీలు ఇవ్వద్దని, ఏది అడిగితే అది చేస్తాం అని చెప్పవద్దని, ప్రజలకు మీ మధ్యలో ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తాం, ఉన్నంతలో అభివృద్ధి చేస్తాం అని హామీలు ఇవ్వాలని సూచించారు.






