- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.. MP ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.10 నుంచి రూ.20 లక్షల మధ్య పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ వాటిని చెల్లించలేదని గుర్తుచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా.. కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు కమీషన్ తీసుకోవడం దారుణమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని అన్నారు. ఇంత అసమర్థ పాలన సాగిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదించేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని సీరియస్ అయ్యారు.
వృద్ధాప్య, దివ్యాంగులకు కొత్త పెన్షన్ల విషయం దేవుడెరుగు.. రాష్ట్రంలో పాత పెన్షన్లు రద్దు చేయడమే గానీ, కొత్త పెన్షన్లకు ఇవ్వడం లేదని విమర్శించారు. కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లిపందిరిలో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు పిల్లలు పుట్టినా కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందడం లేదని అన్నారు. ఇండ్లు కట్టినా, రోడ్లు వేసినా, డ్రైనేజీలు నిర్మించినా, పెన్షన్లు ఇచ్చినా – ఇవన్నీ ప్రజల పన్నుల డబ్బులతోనే జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత జాగీరు లాగా చూపించకూడదని చెప్పారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర నష్టంతో కన్నీళ్లు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.
అయినా బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress)లు కేంద్రం నిందులు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. మోడీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారు. 60 శాతం పైగా బడుగు బలహీన వర్గాలకే అధికార బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలా లేదని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.






