- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ మారుతున్నానన్న ప్రచారం అబద్ధం.. పదే పదే శీల పరీక్ష చేయొద్దు: ఎంపీ ఈటల సంచలన ట్వీట్
బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (BJP) బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన సంచలన ట్వీట్ చేశారు. ‘మీడియా, వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానల్ వారికి విజ్ఞప్తి. నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని మీడియా, వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానల్లలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. బురద చల్లి కడుక్కోమనటం.. బట్ట కాల్చి మీద వేయడం.. మంచిది కాదు. నేను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదు. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి.. గొప్ప కారణం ఉండాలి. టీఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప నా అంతట నేను రాలేదు. నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ. పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదు. వ్యక్తిత్వ హననం చేయకండి. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ట్వీట్ లింక్..






