- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget: హైదరాబాద్ కేంద్రంగా స్పీడ్ రైలు ప్రాజెక్టు.. పార్లమెంట్ ఆవరణలో ఈటల కీలక వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్ పై బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ప్రవేవపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్‌లో సుస్థిరమైన ప్రభుత్వ నడుస్తుందని అన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జీడీపీ ఏడు శాతం పెరిగిందని తెలిపారు. పోయిన సంవత్సరం రూ. 50 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశ పెడితే ఈ సంవత్సరం రూ. 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. బడ్జెట్‌లో అనేక ప్రజారంజక విషయాల మీద దృష్టి పెట్టారని వివరించారు. గంభీరంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గత బడ్జెట్ లో నాలుగు లక్షల కోట్లు పెట్టారని, ఈ సారి కూడా పెట్టారని అన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్ష్యంతో బడ్జెట్ పెట్టారన్నారు.
మందుల మీద టాక్స్ తగ్గించారు..
అనేక మందుల మీద ఇంపోర్ట్ టాక్స్ తగ్గించారని స్పష్టం చేశారు. క్యాన్సర్‌తో పాటు 17 రకాల మందుల మీద పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మారిస్తే ఆ పథకమే తీసేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి.. కానీ గత బడ్జెట్లో రూ. 81 వేల కోట్లు బడ్జెట్ పెడితే ఈ సారి లక్షా యాభై వేల కోట్ల రూపాయల పై చిలుకు ఈ బడ్జెట్ పెట్టారని స్పష్టం చేశారు. గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. దేశ భవిష్యత్తు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆధారపడి ఉంటుంది పోయిన సారి రూ. 11 లక్షల కోట్లు పెడితే ఈ సారి రూ.12 లక్షల కోట్ల పెట్టారని అన్నారు. ఈ బడ్జెట్ లో ఎక్కువ మాన్ పవర్ కోసం నిధులు కేటాయించారు.. లక్షలాదిమంది ఆధారపడి ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డైరీ పౌల్ట్రీ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది అనడానికి బడ్జెట్ స్పీచ్ సజీవ సాక్ష్యం అని ఈటల అన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచడం కోసం అనేక పథకాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారని తెలిపారు.
బ్యాంకింగ్ రంగం నుంచి అప్పులు
వికసిత భారత్ 2047 వైపు ప్రయాణించడానికి ఈ బడ్జెట్ స్పష్టమైన మార్గ నిర్దేశం చేసిందన్నారు. కోట్ల మంది ఆధారపడి ఉన్న సర్వీస్ సెక్టార్ మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి దానిని ప్రోత్సహించే ప్రయత్నం చేసింది.. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మినరల్ హబ్ గా తయారు చేయడం కోసం ప్రత్యేక కారిడార్ ప్రకటించారని పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు నడయాడిన నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ప్రణాళికలను ఈ బడ్జెట్ ఇచ్చిందని వెల్లడించారు. బ్యాంకింగ్ రంగం నుంచి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు ఏం చేయాలి అనే దాని మీద చాలా సునిశితమైన దృష్టితో ఈ బడ్జెట్ ప్రతిపాదన జరిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా స్పీడ్ రైలు ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మొత్తంగా పేదలకు, యువతకు, విద్యార్థులకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని స్పష్టం చేశారు. స్టార్ట్ అప్స్‌ను ప్రోత్సహించేలా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ ఉందని ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.






