- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు శత్రువులు లేరు.. ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాకు శత్రువులు లేరు.. ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నాకు శత్రువులు లేరు.. ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బొల్లారంలో RUB విస్తరణ పనులకు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీ వరకు అందరూ ప్రజల ఓట్లతోనే గెలుస్తారని తెలిపారు. అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల నిలయం అని పేర్కొన్నారు. ఇది అదృష్టం మరోపక్క శాపం అని, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని పార్లమెంట్‌లో మాట్లాడి, మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకపోయినా, భూసేకరణ చేసి ఇవ్వకపోయినా పనులు ఆగిపోతున్నాయి అని మొత్తం నిధులు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 23 RUB, 23 ROB లు పనులు చేయాల్సివుందని, 1993 లో మంజూరు అయినా ఇప్పటికీ కొన్ని బ్రిడ్జి పనులు జరగలేదని అన్నారు. రైల్వే డిపార్ట్మెంట్ చాలా ప్రోఆక్టివ్ గా పని చేస్తుందని తెలిపారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 450 కోట్లు కాచిగూడ, 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశామన్నారు. 450 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఒక్క హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్ల కోసమే రెండువేల కోట్లు ఖర్చు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రధాని మోడీని పొగుడుతున్నామన్నారు. పోస్టర్ల మీద ఫోటోల కోసం కాదు ప్రజలకు గుండెల్లో స్థానం కోసం నా ఆరాటం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నాకు శత్రువులు లేరు.. ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని పేర్కొన్నారు.






