- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajendar: 11 ఏళ్ల తర్వాత కూడా అదే సమస్య.. ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ లో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో డ్రైనేజీ సమస్య (drainage problem) చాలా తీవ్రంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో వరదలు వస్తే కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్ లో పడిపోవడం చూశామని గుర్తుకు చేశారు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్‌లో ఆ సమస్యలు అలాగే ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ యుగంలో గొప్పగా విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాద్ (Hyderabad)లో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని విమర్శించారు.
చాలా వేగంగా విస్తరిస్తున్న సీటీలో చాలా వరకు పైప్‌లైన్స్ లేవని, తాగునీటి కనెక్షన్స్ లేవని, ఒక వేళ నల్లా కనెక్షన్‌లు ఉన్నా కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ ప్రాబ్లమ్ చాలా తీవ్రంగా ఉందని, వేంటనే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.






