- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు: MP ఈటల
ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డిని మొదటి ప్రాదాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డిని మొదటి ప్రాదాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 317 జీవోను సవరిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఉద్యోగులను నిండా ముంచాడని అన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317 జీవో కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించిందని గుర్తుచేశారు. 2014లోపు నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి.. 2014 తరువాత నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయని అడిగారు. ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేసింది బీజేపీ ప్రభుత్వం అని తెలిపారు. హామీ ఇస్తే తప్పకుండా నెరవేర్చే తత్వం బీజేపీ నేతల్లో ఉంటుందని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, 66 మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని, హైడ్రా పేరుతో అమాయకులను రోడ్డుపాలు చేసిన పాపం కాంగ్రెస్‌దే అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే రూ.1,50,000 కోట్ల నిధులు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈటల రాజేందర్ చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా కేంద్రంపై నిందలు వేయడానికి చూస్తోందని మండిపడ్డారు. 70 ఏళ్ల పాలనలో 45 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిందని వారి హయాంలో చేయలేని పనులను మోడీ చేసి చూపించారన్నారు. అందుకే దేశం మొత్తం మోడీ వైపు చూస్తోందని చెప్పారు. ప్రపంచంలో మోడీ తిరుగులేని నాయకుడిగా, భారత్ తిరుగులేని శక్తిగా అవతరించిందని అన్నారు.






