- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిషన్లు వచ్చిన తర్వాత మనం ఆగమైపోయాం : ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మిషన్లు వచ్చిన తర్వాత సంప్రదాయ వృత్తులు తగ్గిపోవడంతో మనం కొంత ఆగమైపోయామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మిషన్లు వచ్చిన తర్వాత సంప్రదాయ వృత్తులు తగ్గిపోవడంతో మనం కొంత ఆగమైపోయామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిల్కానగర్ డివిజన్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్యాలెండర్ అనేది ఒక సంఘం ఉనికికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పద్మశాలి సమాజం గొప్పగా జీవించిందని, సమాజానికి నాగరికతను అందించిన వారమని గుర్తుచేశారు. అయితే మిషన్లు వచ్చిన తరువాత సంప్రదాయ వృత్తులు తగ్గిపోవడంతో మనం కొంత ఆగమైపోయామని అన్నారు. అయినప్పటికీ పట్టుదలతో చదువుకొని ఉద్యోగాలు సంపాదించి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామందే ఉన్నారని తెలిపారు.
మీరు ఒంటరి కాదు.. మేమంతా ఉన్నాం
కులంలో ఉన్న పేదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, చదువుకు దూరంగా ఉన్నవారిని అక్కున చేర్చుకొని అవసరమైన సహాయం అందించాలని సంఘ సభ్యులను కోరారు. ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ ఇంకా దీన స్థితిలో జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయని, అలాంటి వారికి మన సంఘం, మన ఐక్యత ద్వారా ‘మీరు ఒంటరి వారు కారు, మేమంతా మీతో ఉన్నాం’ అనే భరోసా కల్పించాలని సూచించారు. స్మశాన వాటిక కోసం సంఘ సభ్యులు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ఈటల రాజేందర్, అవసరమైన స్థలం అందుబాటులో ఉంటే తన వంతు ప్రయత్నంగా వాటిని కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడ ఆపద ఉన్నా, అవసరం ఉన్నా తమలాంటి వారు ప్రజల వెంట ఉంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






