MP Etala: రాష్ట్రంలో రానుంది బీజేపీ సర్కారే.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో రానుంది బీజేపీ (BJP) ప్రభుత్వమేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) అన్నారు.

MP Etala: రాష్ట్రంలో రానుంది బీజేపీ సర్కారే.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో రానుంది బీజేపీ (BJP) ప్రభుత్వమేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలుకు సాధ్యం కానీ హమీలను ఇచ్చి హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ (Six Guarantees)ల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా తులం బంగారం, ప్రతి మహిళలకు రూ.2,500 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆక్షేపించారు. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మొండి చేయి చూపించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ (Congress) ఏడాది పాలనలో శూన్య హస్తమే మిగిలిందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ (Job calendar) వేస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. ఇలా అన్ని హమీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని.. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ (BJP) కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీని నిలబెట్టాలని ఈటల పిలుపునిచ్చారు.

Next Story