- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP ELECTION RESULTS : నేడు జడ్జిమెంట్ డే.. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. అయితే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైంది. దేశ వ్యాప్తంగా 542 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒడిశా 21 ఎంపీ, 147 శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. యూపీలోని 80 లోక్ సభ స్థానాలకు 81 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు 289 కౌంటింగ్ హాళ్లు, తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లకు 39 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు 52 ఓట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని 28 లోక్ సభ సీట్లకు 29 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గుజరాత్‌లోని 25 లోక్ సభ స్థానాలకు 26 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు 20 ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్డీఏకే మళ్లీ అధికారం అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. మూడోసారి అధికారం కైవసంపై ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ గెలిస్తే నెహ్రూ రికార్డును మోడీ చేయనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 మంది పోటీ చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా నేడు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు రాష్ట్రంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మొత్తం 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుపుతారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2.18లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. చొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. యాకుత్ పురా అసెంబ్లీ సెగ్మెంట్‌లో 21 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.






