- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala Rajender: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ ను గెలిపించండి: ఈటల
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ కాడర్ మీటింగ్ లో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో యూనియన్లు, ధర్నాలు అన్నిటికీ సంఘీభావం ప్రకటించిన వాడినని రాబోయే ఎన్నికల్లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ నీ గెలిపించాలని కార్మికులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కోరారు. మంగళవారం సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ (Security Printing Press Mazdoor Sangh) కాడర్ మీటింగ్ -2025 ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా ప్రింటింగ్ ప్రెస్ అంతా చూసి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు చల్లగా ఉండాలని మరింత మందికి ఉపాధి కల్పించాలని కోరుకునే వ్యక్తిని నేను అని చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ మూతపడి కార్మికులు రోడ్డున పడ్డ నాడు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టించానని గుర్తు చేశారు. పాతికేళ్ల క్రితం మూతపడ్డ రామగుండం ఎరువుల కంపెనీని తెరిపించడం ఎవరి తరం కాలేదు. కానీ రూ.6,300 కోట్లు కేటాయించి తిరిగి ప్రజలకు అంకితం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ కు వచ్చిన ఈటలకు ప్రెస్ మేనేజర్ ఎస్.ఆర్ వాజ్ పే స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
వారి బాధను నాకు తెలుసు:
ఈ కాలంలో పిల్లలు అందరూ చదువుకుంటున్నారని వారికి ఉపాధి కల్పించేందుకు భాజప్తా కేంద్ర బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతి ఆరునెలలు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తున్నారని చెప్పారు. కార్మికుల, ఉద్యోగుల బాధలు నాకు తెలుసు వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానన్నారు. కార్మిక సంఘాలలో పనిచేసే వారికి కుటుంబంతో పాటు వారు పనిచేస్తున్న కంపెనీ ఎదుగుదల, కార్మికుల శ్రేయస్సు, స్వేచ్ఛ, హక్కుల కోసం పనిచేయాలి. నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.






