Dr. Laxman : ఏమి చేయలేక బీజేపీపై సీఎం రేవంత్​ నిందలు.. ఎంపీ లక్ష్మణ్​ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని భావించి బీజేపీపై నిందలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆరోపించారు.

Dr. Laxman : ఏమి చేయలేక బీజేపీపై సీఎం రేవంత్​ నిందలు.. ఎంపీ లక్ష్మణ్​ తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని భావించి బీజేపీపై నిందలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ (Dr. Laxman) ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను మోసం చేశారని, రెండు సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు ఏవీ అమలు కాలేదు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని తీవ్రంగా విమర్శించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల పంట నష్టం, విద్యార్థుల ఫీ రీయింబర్స్‌మెంట్ లేకపోవడం, ఉన్నత చదువులు అర్ధాంతరంగా మానేస్తున్నారు.శాంతి భద్రతలు క్షీణించి, గంజాయి, గన్ కల్చర్ పెరిగిందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 15 రోజులుగా (Jubilee Hills) జూబ్లీహిల్స్‌లో మకాం వేశారని, ఎన్నికల ముందు భయపడుతున్నారు. రుణమాఫీ, పంట బోనస్, 2 లక్షల ఉద్యోగాలు , విద్యా భరోసా, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు 2500, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజలు నిలదీస్తున్నారు. ముస్లిం ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు దిగజారి మాట్లాడుతున్నారు. సైనికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విరుచుక పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతి పై ఆధారాలు ఉన్నా 100 రోజుల్లో చర్యలు తీసుకోలేదు, బీఆర్​ఎస్​తో రాజీ పడ్డారు. దేశాభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేదలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తుందన్నారు.జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ రెండు పార్టీలను తిప్పికొట్టాలి. భవిష్యత్తులో డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story