- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంటింటి నుంచి చట్టసభల వరకు.. ‘నారీ శక్తి’దే రాజ్యం: ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్మే సంప్రదాయం భారతదేశ సంప్రదాయమని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్మే సంప్రదాయం భారతదేశ సంప్రదాయమని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టబోతున్నారు. మహిళా సంక్షేమనికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు 33 రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధితో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎవరు చేయని పని మోడీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా చేయలేకపోయింది. బిల్లు అమలు చేసినప్పుడే ఆ బిల్లుకు సార్థకత. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులు పార్టీలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దతు తెలపాలి. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చేలా సహకరించాలి. ఇది ఒక సాధారణ బిల్లు కాదు. కోట్లాది మంది ఆడబిడ్డల ఆశయం. ఈ బిల్లు రాజకీయాల్లో కొత్త నాంది.
అభివృద్ధి వైపు అడుగులు..
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయితే.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత.. పార్లమెంట్ స్థానాలు 17 స్థానాల నుంచి 26 స్థానాలకు పెరుగుతాయి. అందులో 9 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉంటారు. 273 మంది మహిళలు దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కి వస్తారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 180కి పెరుగుతాయి. అందులో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చునే అవకాశం దక్కుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ చట్టసభల్లో పెద్ద సంఖ్యలో మహిళల ప్రతినిధ్యం పెరుగుతుంది. దేశ రాజకీయాల్లోకి మహిళలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కల్పిస్తోంది. గతంలో వంటింటికి పరిమితమైన మహిళలు.. అనేక రంగాలలో వచ్చిన అవకాశాలను తన శక్తిని నిరూపించుకుంది. దేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు అడుగులు వేయగలుగుతాం. ఒక తల్లిగా కుటుంబాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడంలో సమర్ధవంతంగా, చక్కగా వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తోంది. చట్ట సభలో మహిళల సంఖ్య పెరిగితే మహిళా ఆర్థిక, ఉపాధి, రక్షణలలో కీలక మార్పులు వస్తాయి. అనేక మంది మహిళలు రాజకీయాల్లో తమ నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు. ఏ రంగంలో అయినా రాణించగలం అని రుజువు చేస్తున్నారు. 40 ఏళ్లుగా మహిళా సాధికారత అని ప్రగల్భాలు కాంగ్రెస్ పలికింది. కనీసం ఇప్పుడైనా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలుపాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవాలని అనేక మంది కుట్రలు పన్నుతున్నారు. మహిళల గౌరవం పెంచేలా అన్ని రకాలుగా ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. ప్రధాని అయిన నాటినుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
పేద కుటుంబాల్లో గుణాత్మక మార్పు..
మహిళల ఆత్మగౌరవం పెంచేలా.. స్వచ్ భారత కింద 12వేల కోట్ల ఇండ్లకు టాయిలెట్స్ నిర్మాణం చేయించారు. పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అందించడం జరిగింది. జన్ ధన్ యోజన, స్టార్టాప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ముద్ర రుణాలు అందిస్తున్నారు. వికాసిత్ భారత్ 2027 లక్ష్యం తో ముందుకు వెళ్తున్నాం. దేశ GDP పెరుగుతుందని అంటే.. మహిళల భాగస్వామ్యం కీలకం. మహిళా శక్తి కి రాజకీయ శక్తి తోడైతే.. గ్రామీణ ప్రాంతాల్లో,రైతు, పేద కుటుంబాల్లో గుణాత్మక మార్పు వస్తుంది. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాలి అంటే.. మహిళాల భాగస్వామ్యం అవసరం. మహిళలను విద్య,ఆరోగ్యం,ఉపాధి, రక్షణ అన్నింటిలో ప్రోత్సాహకం కల్పిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గర్భిణీ, బాలింతల కు పోషకాహారం అందిస్తుంది. క్యాన్సర్ బారిన కడకుండా.. వాక్సినేషన్ బాలికలకు అందిస్తుంది. బీజేపీకి పేరువస్తుందని.. ప్రత్యర్థులు కుళ్ళు బుద్ధితో అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఈ బిల్లుకు సహకరించాలి. మహిళలకు డ్రోన్ ట్రైనింగ్, స్టాండప్ ఇండియా కింద ప్రోత్సహిస్తుంది, దీదీ లక్పతి పథకం ఇలా అనేక పథకాలతో ప్రోత్సహిస్తుంది. మహిళలను గౌరవించే దేశం ఇది. ఈ బిల్లుకు అడ్డు పడకండి. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌లలో బీజేపీకి క్రెడిట్ వస్తుందని ఏది వాడితే అదీ మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ మాదిరి ఉత్తర, దక్షిణ రాష్ట్రాలని.. మాట్లాడారో అలాగే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లు.. తెలంగాణలో సీట్ల పెంపు జరుగుతుంది. మహిళా బిల్లుకు అందరూ మద్దతు తెలుపుతూ.. మహిళలు, పురుషులు, యువత అందరి చిన్న వీడియో చేయాలి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదు.. ఇప్పుడే అందుకు మాట్లాడుతున్నారు. టీవీలలో బ్రేకింగ్ న్యూస్‌ల కోసం రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.






