DK Aruna: స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి

by Gantepaka Srikanth |

మహారాష్ట్ర(Maharashtra) ఫలితాల స్ఫూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) పిలుపునిచ్చారు.

DK Aruna: స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra) ఫలితాల స్ఫూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) పిలుపునిచ్చారు. నాంపల్లి బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అసమర్థతను అడుగడుగునా ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలపడినప్పుడే.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయ వచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మరింత బలపడాలని, స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని ఆమె కోరారు. సభ్యత్వ నమోదులో పురోగతి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిపినట్లు డీకే అరుణ తెలిపారు. డిసెంబర్ 10 వరకు రెట్టించిన ఉత్సాహంతో బూత్ స్థాయిలో మరిన్ని సభ్యత్వాలు పెంచాలని డీకే అరుణ కోరారు.

Next Story