- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DK Aruna: తండ్రికి లేఖ రాయడం ఏంటి? కవిత లెటర్‌పై ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తన కూతురు ఎమ్మెల్సీ కవిత రజతోత్సవ సభపై లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు తన కూతురు ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) రజతోత్సవ సభపై లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లెటర్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) స్పందించారు. ఇవాళ (శుక్రవారం) డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటి? ఎప్పుడంటే అప్పుడే తండ్రిని కలిసే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. కవితను కేసీఆర్ కలవట్లేదా? అసలు లేఖ రాయడానికి గల ఉద్దేశం ఏంటి? అని ప్రశ్నించారు. మరోవైపు అన్న(కేటీఆర్) చెల్లెలు మధ్య, కుటుంబంలో ఏదైనా డిఫరెన్సెస్ ఉందా? అని ప్రశ్నించారు. అసలు ఇది కవిత రాసిన లేఖనా? కాదా? నిన్నటి నుంచి లేఖ చక్కర్లు కొడుతున్న ఇప్పటివరకు దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావొచ్చని అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ప్రాబల్యం తగ్గుతోందని, బీజేపీకి తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఆ పార్టీని వీక్ చేయాలని.. రెండు పార్టీలు భావిస్తున్నాయని ఆరోపించారు. గతంలోనూ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఇలాంటి ఎత్తుగడనే తీసుకొచ్చారని గుర్తుకు చేశారు. బీజేపీ పార్టీని అడ్డుకోవాలనే ఈ లేఖ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ డ్రామాలు సైతం వారికి కొత్త కాదన్నారు. లెటర్ కేసీఆర్ వరకు చేరిందా? మధ్యలోనే బయటకు వచ్చిందా అనేది కూడా తెలియాలని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేయడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అభిప్రాయపడ్డారు. కాగా, తండ్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాసినట్లు మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని, బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలామంది ప్రచారం చేస్తున్నారు.. నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ.. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ.. అంటూ కవిత లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది.






