వరంగల్ సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు.. తెలంగాణకు కేంద్రం నిధులు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

వరంగల్ సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడారని, ఆయన స్పీచ్‌లో కొత్తదనం ఏమిలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు.

వరంగల్ సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు.. తెలంగాణకు కేంద్రం నిధులు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Warangal Sabha) వరంగల్ సభలో కేసీఆర్ (KCR) పచ్చి అబద్ధాలు ఆడారని, ఆయన స్పీచ్‌లో కొత్తదనం ఏమిలేదని బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) విమర్శించారు. ఈ మేరకు ఆమె ఇవాళ (సోమవారం) మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు బయటకు రాని కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసి రజతోత్సవం పేరు మీద బయటకు వచ్చారని తెలిపారు. వాళ్ల ఉనికిని చాటుకోవడం కోసం సభ పెట్టారని వెల్లడించారు. సీఎంగా పదేళ్లు పనిచేసి అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. లక్షల కోట్లకు అవినీతికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నాసిరకంతో నిర్మించడంతో ఖతమైందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం అయిపోయిందని మాట్లాడారు.. ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని, ప్రజలను మోసం చేశారు కాబట్టి వాళ్లను ఇంటికి పంపించారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని, 11 ఏండ్లలో పదకొండు రూపాయలు వచ్చాయని కేసీఆర్ అనడం పచ్చి అబద్దమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు చూపిస్తే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 2023 వరకే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతో కాకపోతే కేసీఆర్ ఇంట్లో నుంచి తీసి ఇచ్చారా ? అని మండిపడ్డారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ.. ఫామ్‌హౌస్‌లో కూర్చోని కలలు కంటున్నారని అన్నారు. ప్రజల మధ్య ఉండేది బీజేపీ పార్టీ అని, ఫామ్‌హౌస్‌లో కలలు కనేది కేసీఆర్ అని విమర్శించారు.

Next Story