- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది నాపై చేసిన దాడి మాత్రమే కాదు.. ఫోన్ ట్యాపింగ్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర ట్వీట్
బీఆర్ఎస్ హాయంలో బీజేపీ నేతలు దర్మపురి అరవింద్‌తో సహా దాదాపు 200 మంది ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హాయంలో బీజేపీ నేతలు దర్మపురి అరవింద్‌తో సహా దాదాపు 200 మంది ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్లు (phone tapping) ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే నన్ను తీవ్రంగా కలవరపెట్టే కొన్ని భయానక విషయాలు బయటపడ్డాయని తెలిపారు. ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని కోరారు. (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుటుంబంతో సంబంధం ఉన్నందునా.. తెలంగాణ ప్రభుత్వం నేరస్థులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉండొచ్చని ఆరోపించారు. ఒక లోక్‌సభ సభ్యుడిగా నాకు ప్రజలు బాధ్యతనిచ్చారని, కానీ నా ఫోన్ కాల్స్, బెడ్‌రూమ్స్, బాత్రూంలను అక్రమంగా నిఘాలో పెట్టడానికి కాదన్నారు.
ఇది కేవలం రాజకీయ కక్ష కాదని, ఇది నేరపూరిత వేధింపులు అని పేర్కొన్నారు. 2019 నుండి నన్ను శారీరకంగా దాడి చేసి, నిరంతరం వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం కుట్రకు మాజీ కేసీఆర్ కుటుంబమే మూలం, వారు రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా ఉపయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ట్యాపింగ్ కేసుపై లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోమ్ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఇది నా పై చేసిన దాడి మాత్రమే కాదు.. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించాలని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాయనున్నట్లు ట్వీట్ చేశారు.






