MP Arvind: కేసీఆర్‌కు వారి నుంచి ముప్పు ఉంది! ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి కన్నా ప్రమాదకరమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MP Arvind: కేసీఆర్‌కు వారి నుంచి ముప్పు ఉంది! ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల కుటుంబం తీవ్రవాదులకేమి తక్కువ కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వీరి కన్నా ప్రమాదకరమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. 2018 ఎలక్షన్స్ కోసమని దాదాపు లక్ష కోట్లపైన (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ప్రాజెక్టు వ్యయం పెంచే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. కేంద్ర‌ం ఫండింగ్ ఇవ్వడం లేదని, నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించడం లేదని అనేక సార్లు కేటీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం అవ్వకముందే ప్రాజెక్టు మొదలుపెట్టి, నచ్చినట్టు ప్రాజెక్టు ప్లానింగ్‌లో, నిర్మాణ ప్రదేశాలలో, ప్రణాళికలలో మార్పులు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఆదరాబాదరాగా కట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. మరోవైపు ఇన్నెండ్లు కాళేశ్వరం అవినీతిపై ఆరా తీస్తాం.. కేసీఆర్‌ను జైలు లో వేస్తాం అని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు గమ్మున ఉన్నాడు? అని ప్రశ్నించారు. ఇక, ఏం ముఖం పెట్టుకుని రేపు పార్టీ సభ పెట్టబోతున్నారో కేటీఆర్ (KTR) చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం

మాజీ సీఎం (KCR) కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే గత కొన్నేళ్లుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. అందరు ఒకే దగ్గర ఉంటే తనను కుటుంబ సభ్యులే చంపే అవకాశం ఉందనే భయంతో కేసీఆర్ దూరంగా ఉంటున్నారని ఎంపీ అన్నారు. కన్నా బిడ్డలు ఆయనను కలవాలన్న ముందుగా అపాయింట్మెంట్ ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు.

Next Story