- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే.. మీరు చేసినట్టే’ ఏసీపీపై ఎంపీ అరవింద్ సీరియస్!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ కానిస్టేబుల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో ఏసీపీతో ఆయన వాగ్వివాదానికి దిగారు. నిజామాబాద్ పరిధిలోని బూత్ నంబర్ 7లో శంకర్ అనే కానిస్టేబుల్, ఒక మున్సిపల్ ఉద్యోగి కలిసి ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రభావితం చేస్తున్నారని ఎంపీ అరవింద్‌కు సమాచారం అందిందని.. దీనిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఏసీపీతో ఎంపీ మాట్లాడారు. ‘మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే, మీరు చేసినట్టే’ అని ఎంపీ అరవింద్ ఏసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మాకు నేర్పించినట్లు కాదు.. మీరే నేర్చుకోండి ముందు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కుల రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు..
వినాయక్ నగర్ డివిజన్‌లో ఎంపీ అరవింద్ కార్యకర్తలతో మాట్లాడారు. ఓ డివిజన్‌లో ప్రత్యర్థులు కుల ప్రస్తావన తెస్తున్నారని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. అరవింద్ ఘాటుగా స్పందించారు.‘క్యాస్ట్ ఫీలింగ్ తెస్తే, ఒక్కటే అడగండి.. గతంలో కాశ్మీర్‌లో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేటప్పుడు కులం చూసి చంపారా? లేక హిందువులని చంపారా? అని నిలదీయండి’ అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచే ఉత్సాహంగా సాగుతోంది. ఓటర్లు బారులు తీరారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరగగా, నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ ఘటన మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.






