కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టిన సీఐ (వీడియో)

by Taduka Kalyani |   (  Updated:2026-02-11 10:42:39  IST  )

సంగారెడ్డి మున్సిపాలిటీలో పోలీసులకు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. 34వ వార్డులో ఆ వార్డు అభ్యర్థి అడ్డును సీఐ కాలర్ పట్టుకోవడంతో గొడవ మొదలైంది.

కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టిన సీఐ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో/ సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి మున్సిపాలిటీలో పోలీసులకు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 34వ వార్డులో ఆ వార్డు అభ్యర్థి అడ్డుకుని సీఐ కాలర్ పట్టుకోవడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ శ్రేణులు సీఐ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి పోలింగ్ సెంటర్ వద్దకు చేరుకుని పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులతో జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జగ్గారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

నేనో మీరో తేలిపోవాలి

ఈ సందర్భంగా జగ్గారెడ్డి పోలీసులపై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పిన మా అభ్యర్థిపై సీఐ శివకుమార్ గల్లా పట్టాడని ఆ సీఐ మొగోడు అయితే ఇక్కడికి రావాలని మండిపడ్డారు. సంగారెడ్డిలో ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దానికి సీఐ, హోంగార్డే కారణం అని.. ఏమనుకుంటున్నార్రా మీరు హోం గార్డులు? మొగోణ్ణి నేనో పోలీసులో ఈరోజు తేలిపోవాలంటూ పోలీసులపై రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే.. మీరు చేసినట్టే’ ఏసీపీపై ఎంపీ అరవింద్ సీరియస్!

Next Story