రామచందర్ రావుతో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన అరవింద్

by Ajay Maddhiboyina |

బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

రామచందర్ రావుతో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన అరవింద్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. రామచందర్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రామచందర్ రావు తనకు బడ్డీ బ్రదర్ లాంటి వాడని చెప్పారు. ఆయన తనకు స్నేహితుడి లాంటివాడని, పెద్దన్నలాంటి వాడు అని చెప్పారు. ఒకసారి తాను మాట్లాడుతూ రామచందర్ రావు ఫిర్యాదులు ఇవ్వనివ్వకండి అనబోయి, ఇవ్వకండి అని అన్నానని ఒక ఛానల్ దానిని ప్రచారం చేసిందన్నారు. రామచందర్ రావు అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.

ఆయనతో తనకు ఎలాంటి సమస్య ఉండదని, రాదని అన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంధు ప్రీతితో పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని విమర్శించారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రెండు రోజులు జైలులో పెట్టారని అన్నారు. కానీ రేవంత్ రెండేళ్లు టైంపాస్ చేసి కేసును సీబీఐకి అప్పగించారని విమర్శించారు. అవినీతి, బంధుప్రీతి, అసమర్దత, చేతగానితనం కలగలిసిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అన్నారు.

Next Story