MP Chamala: మెట్రో రెండో దశ మంజూరు చేయండి.. లోక్ సభలో ఎంపీ చామల

by Prasad Jukanti |

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

MP Chamala: మెట్రో రెండో దశ మంజూరు చేయండి.. లోక్ సభలో ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కోరారు. నగరానికి సెకండ్ ఫేజ్ మెట్రో మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మెంట్రో రెండో దశ గురించి చామల మాట్లాడారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా నగరం అని ఇది దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతోందన్నారు. నగరం ప్రైవేటు వాహనాల విస్ఫోటనం, ట్రాఫిక్ రద్దీ, కాలుష్య స్థాయిలను ఎదుర్కొంటోందని ఈ సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్ మెట్రోను ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 5 కారిడార్లను (76.4 కి.మీ) కవర్ చేసే హైదరాబాద్ మెట్రో రైలు దశ-2 విస్తరణ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్ ను నవంబర్ 2024లోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం ఖర్చు రూ.24,269 కోట్లతో పీపీపీ విధానం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. ఈ ప్రతిపాదనలను వీలైనంత త్వరగా ఆమోదించి మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు.

Next Story