- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ పార్లమెంటేరియన్ల వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఎంపీ చామల
న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణం, సుస్థిరతపై దక్షిణ ప్రపంచ పార్లమెంటేరియన్ల వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ మొదటి రోజు గురువారం వాతావరణ మరియు స్థిరత్వ వర్క్‌షాప్ అనే అంశంపై స్వనితి ఇనిషియేటివ్స్ సీఈఓ ర్విత్వికా భట్టాచార్య ప్రారంభ ప్రసంగం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణం, సుస్థిరతపై దక్షిణ ప్రపంచ పార్లమెంటేరియన్ల వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ మొదటి రోజు గురువారం వాతావరణ మరియు స్థిరత్వ వర్క్‌షాప్ అనే అంశంపై స్వనితి ఇనిషియేటివ్స్ సీఈఓ ర్విత్వికా భట్టాచార్య ప్రారంభ ప్రసంగం చేశారు. ఈ వర్క్‌షాప్‌లో గ్లోబల్ స్థాయిలో వాతావరణ మార్పులు, శక్తి మార్పిడి మరియు పారిశ్రామిక స్థిరత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పర్యావరణ వేత్తలు, రాజకీయ ప్రజాప్రతినిథులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలు అనురాగ్ఠాకూర్, హిబి ఈడెన్‌లు కూడా వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాల స్థాయి శక్తి మార్పిడి, గ్లోబల్ వాతావరణ అత్యావశ్యకతలు, పారిశ్రామిక డీకార్బనైజేషన్ వంటి అంశాలను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం, విధాన పరమైన ఆవశ్యకతలు మరియు స్థిరమైన అభివృద్ధి కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలు ప్రధానంగా చర్చించారు.






