MP Chamala Kiran: ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ మేయర్‌తో ఎంపీ చామల సమావేశం

by Ramesh Naini |

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

MP Chamala Kiran: ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ మేయర్‌తో ఎంపీ చామల సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar) ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు. ఆస్ట్రేలియా రెడ్ ల్యాండ్ సిటీ కౌన్సిల్ బ్రిస్బేన్ మేయర్‌ (Brisbane Mayor) తో సమావేశం అయినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ అంశాల గురించి చర్చించినట్లు వెల్లడించారు. నగరాల అభివృద్ధి, క్రీడారంగం, పట్టణాభివృద్ధి, దిగుమతులు, ఎగుమతులు, సినీ పరిశ్రమల అంశాలు, నైపుణ్యాభివృద్ధిలో సహకారానికి గల అవకాశాల గురించి సమావేశంలో చర్చించినట్లు వివరించారు.

Next Story